: యూకే పార్లమెంట్ వద్ద కత్తి పట్టుకు తిరుగుతున్న వ్యక్తి అరెస్టు
యూకే పార్లమెంట్ వెస్ట్ మినిస్టర్ గేట్ వద్ద కత్తి పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కత్తి పట్టుకుని గేటు వద్ద తిరుగుతున్న వ్యక్తిని గేటు బయట నుంచి గమనించిన కొందరు అరవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ గేట్లు మూసివేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.