: టీమిండియా గెలిస్తే ఉచితంగా ఇస్త్రీ చేస్తానన్న వ్యాపారికి పాక్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్!


2011లో క్రికెట్ వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న ఆనందంలో ఆగ్రాలోని ప్రతాప్ నగర్ కు చెందిన క్రికెట్ వీరాభిమాని, లాండ్రీ వ్యాపారి ఆజాద్ సింగ్ తన కాలనీ వాసులకు ఉచితంగా ఇస్త్రీ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆజాద్ సింగ్ ప్రస్తావన ఎందుకంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధిస్తే.. తన కాలనీ వాసులకు ఉచితంగా మళ్లీ ఇస్త్రీ చేస్తానని తాజాగా ప్రకటించాడు. అయితే, ఈ ప్రకటన చేసిన ఆజాద్ సింగ్ కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

ఈ ఆఫర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పమంటూ నిన్న రాత్రి ఫోన్ చేసిన వ్యక్తి గట్టిగా అన్నాడు. దేశంపై, టీమిండియాపై ఉన్న ప్రేమతోనే ఈ ప్రకటన చేశానని ఆజాద్ బదులిచ్చాడు. కానీ, ఈ ఫోన్ కాల్ తో భయపడిపోయిన ఆజాద్ సింగ్ కు నిన్న రాత్రంతా నిద్రపట్టలేదు. ఈ విషయాన్ని స్థానిక విశ్వ హిందూ పరిషత్ కు చెందిన రాజేంద్ర అనే వ్యక్తికి చెప్పాడు. ఆజాద్ కు తోడుగా నిన్నరాత్రంతా అతనితోనే ఆ వ్యక్తి ఉన్నాడు. ఆజాద్ కు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి మళ్లీ ఫోన్ చేయలేదు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై ఆజాద్ తో రాజేంద్ర ఫిర్యాదు చేయించాడు.

  • Loading...

More Telugu News