: శిరీష ఎవరో నాకు తెలియదు.. పోలీసు ఉన్నతాధికారులే నా భర్తను హత్య చేశారు: ఎస్సై ప్రభాకర్ రెడ్డి భార్య


తన ప్రవర్తనే వల్లే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని... తనపై విచారణ ప్రారంభమవుతుందనే భయంతోనే ఎస్సై ప్రభాకర్ రెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పడాన్ని ఆయన భార్య తప్పుబట్టారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడలేదని... పోలీసు ఉన్నతాధికారులే తన భర్తను చంపారని ప్రభాకర్ రెడ్డి భార్య స్పష్టం చేశారు. పోలీస్ క్వార్టర్స్ కు తన భర్త ఎన్నడూ గన్ తీసుకురాలేదని చెప్పారు. ఏసీపీ గిరిధర్ తన భర్తను వేధించేవాడని తెలిపారు. ఈ విషయం గురించి తనతో తన భర్త చాలా సార్లు చెప్పాడని అన్నారు. తన భర్తది ముమ్మాటికీ ఉన్నతాధికారులు చేసిన హత్యేనని ఆమె తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News