: మార్స్ పై మానవ కాలనీల నిర్మాణం జీవిత కాలంలో సాధ్యమే: ఇలోన్ మస్క్
మార్స్ (అంగారకుడు) గ్రహంపై మానవ కాలనీలను ఏర్పాటు చేయాలన్న కల మన జీవితకాలంలోనే నెరవేరుతుందని స్పేస్ఎ క్స్ సీఈఓ ఇలోన్ మస్క్ అన్నారు. మార్స్ పై మానవ కాలనీలు నిర్మించడంపై ఓ కొత్త పరిశోధనతో మస్క్ తన విజన్ ను పంచుకున్నారు. ఈ గ్రహంపై మానవ కాలనీలు మన జీవిత కాలంలోపే నిర్మించడం జరుగుతుందని, ఈ గ్రహంపైకి మన భూమి నుంచి వస్తువులను మోసుకెళ్లడానికి అయ్యే ఖర్చును తగ్గించడమనేది ఇంజనీర్లు, శాస్త్రవేత్తల ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అని మస్క్ అన్నారు. స్పేస్ ఎక్స్ మార్స్ ఆర్కిటెక్చర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ, మార్స్ గ్రహాన్ని మానవ కాలనీల నిర్మాణానికి సాధ్యం చేస్తామని, మాన్ జీవితకాలంలో అది సాధ్యమవుతుందని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.