: మా చెల్లెలు పిరికిది కాదు... ముమ్మాటికీ అది హత్యే: శిరీష సోదరి


తన చెల్లెలు శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి భార్గవి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు శిరీష ఘటనపై పోలీసులు మాట్లాడనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పదించారు. ఈ కేసులో తమకు పలు అనుమానాలున్నాయని చెప్పారు. ఈ కేసులో నిందితురాలు తేజస్వినిని ఎందుకు దాస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తన చెల్లెలిది ముమ్మాటికీ హత్యేనని ఆమె స్పష్టం చేశారు. ఈ హత్య వెనుక రాజీవ్, శ్రావణ్, తేజస్వి ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు కావాలనే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. రెండు సార్లు తన చెల్లెలిపై దాడి చేసిన వాడు హత్య చేసి ఉంటాడని ఎందుకు భావించకూడదని ఆమె ప్రశ్నించారు. తన చెల్లెలికి ఎలాంటి సమస్యలు లేవని, కుటుంబం మొత్తం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. అలాంటిది అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News