: ప్రేమకు ఓకే చెప్పలేదని దాడి చేసిన రోమియో.. వీడియో చూడండి
మహిళలపై అఘాయిత్యాలకు, దాడులకు పెట్టింది పేరైన ఉత్తరప్రదేశ్ లో అటువంటిదే మరో ఘటన పిలిభిత్ ప్రాంతంలో జరిగింది. ఓ ఆకతాయి తనను ప్రేమించాలంటూ ఓ అమ్మాయిని బలవంత పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆ ఆకతాయి, యువతి చెంపపై చేత్తో వరుసగా ఐదు సార్లు బలంగా కొట్టాడు. అక్కడే ఉన్న మరో యువతి వద్దంటూ అరిచింది.
ఇంతలో అక్కడకు మరో యువతి స్కూటర్ పై రావడంతో అతడు తన దాడిని ఆపేశాడు. ఆ తర్వాత కొట్టినందుకు క్షమించాలంటూ ప్రాధేయపడ్డాడు. కాళ్లు పట్టుకోబోయాడు. కానీ, అతడి క్రూరత్వాన్ని కళ్లారా చూసిన ఆ యువతి మళ్లీ నిరాకరించింది. స్కూటర్ పై అక్కడకు వచ్చిన యువతి ఇదంతా గమనించి దాడికి గురైన బాధితురాలి చేయి పట్టుకుని తన వెంట లోపలికి తీసుకెళ్లింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.