: మైసూరులో దారుణం: ఒక బైక్ ను ఓవర్ టేక్ చేయబోయి.. మరోబైక్ ను ఢీకొట్టిన బస్సు... ఒకరి మృతి
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ బస్సు మైసూరులోని రోడ్డు మలుపు వద్ద ఒక ద్విచక్రవాహనదారుడ్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనదారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఢీ కొట్టిన అనంతరం ఆ బస్సు డ్రైవర్ కనీసం ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన వివరాలు అక్కడికి దగ్గర్లోని షాపులో అమర్చిన సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.