: జైలులాంటి ఉయ్యాలలోంచి తెలివిగా బయటకు వచ్చిన పసికందులు.. మీరూ చూడండి!
జైలులాంటి ఉయ్యాలలోంచి ఇద్దరు పసిపిల్లలు బయటకు వస్తుండగా తీసిన ఓ వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన కవలలు గ్రీస్సన్, యూదా ఆల్డర్స్ ఒక ఉయ్యాలలో ఉన్నారు. వారిద్దరికీ అందులోంచి బయటకు వెళ్లాలని అనిపించింది. గ్రీస్సన్ మొదట అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. అనంతరం యూదా ఆల్డర్స్ తన సోదరుడు గ్రీస్సన్కు సాయం చేస్తాడు. దీంతో మెల్లిగా ఆ ఉయ్యాల ఎక్కేసి గ్రీస్సన్ బయటకి వచ్చాడు. ఆ తరువాత వెంటనే యుదా ఆల్డర్స్ కూడా అందులోంచి బయటకు వచ్చేస్తాడు. వీరి తెలివితేటలకు నెటిజన్లు హ్యాట్సాప్ అంటున్నారు. ఆ చిన్నారుల తల్లి చెల్సియా తీసిన ఈ వీడియోను మీరూ చూడండి.