: కర్రలు, కత్తులతో బీజేడీ కార్యకర్తల వీరంగం!
ఒడిశాలో బిజూ జనతాదళ్ (బీజేడీ) కార్యకర్తలు కర్రలు,కత్తులతో వీరంగం సృష్టించారు. టిట్లానగర్ లో కొందరు వ్యక్తులపై బీజేడీ కార్యకర్తలు దాడికి పాల్పడి, చితకబాదారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వారిని అదుపు చేసేందుకు యత్నించారు. అయితే, పోలీసులపై బీజేడీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులకూ గాయాలయ్యాయి. వీరంగం సృష్టించిన కార్యకర్తలను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.