: మంత్రి గంటాతో నాకు ఎటువంటి విభేదాలు లేవు: అయ్యన్నపాత్రుడు


విశాఖపట్టణంలో భూ కుంభకోణాల విషయమై మంత్రులు గంటా శ్రీనివాసరావుకు అయ్యన్నపాత్రుడుకి మధ్య విభేదాలు ఉన్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ, గంటాతో తనకు ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. సీఎం చంద్రబాబుకు మంత్రి గంటా రాసిన లేఖలో తన పేరు ఎందుకు పేర్కొన్నారో తెలియదని, తన వల్ల ప్రభుత్వ ప్రతిష్ట తగ్గడం కాదని పెరిగిందని చెప్పారు. విశాఖలో వేల ఎకరాల భూమి కబ్జా అయిన మాట వాస్తవమేనని మరోమారు ఆయన చెప్పారు. పేదలకు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని, గంటా కూడా అదే కోరుకుంటున్నట్టు అయ్యన్నపాత్రుడు చెప్పారు.

  • Loading...

More Telugu News