: నేటి పెట్రోల్ ధరల కోసం ఎస్ఎంఎస్ కొడితే చాలు
పెట్రోల్, డీజిల్ ధరలను ఇక నుంచి ప్రతీ రోజూ సవరించాలని చమురు కంపెనీలు నిర్ణయించాయి. రేపటి నుంచి (ఈ నెల 16) ఈ నిర్ణయం అమల్లోకి రాబోతుంది. ఇప్పటి వరకు నెలకు రెండు సార్లు (ప్రతి 15 రోజులకోసారి) మాత్రమే ధరలను సవరిస్తున్నారు. మరి ఏ రోజుకారోజు మారిపోయే ధరలను తెలుసుకోవడం ఎలా...? చాలా సింపుల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మొబైల్ యాప్ ఉంటే చాలు. దీని కోసం ప్లే స్టోర్ లో fuel@IOC అని టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవడమే. ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ లో ఎస్ఎంఎస్ ద్వారా ధర గురించి తెలుసుకోవాలంటే RSP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి DEALER CODE టైప్ చేసి 9224992249 నంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలని ఐవోసీ తెలిపింది.