: స్నేహితుడ్ని సేవ్ చేసేందుకు గ్యాంగ్ రేప్ అంటూ కట్టుకథ అల్లిన యువతి!


ఇంటికి రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది? అని ప్రశ్నించిన తల్లిదండ్రులకు కట్టుకథలు చెప్పి తప్పించుకోవాలని చూసిన 16 ఏళ్ల యువతి ఊహించని అనుభవాన్ని ఎదుర్కొంది. పోలీసులు తెలిపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని రోహిణిలోని బేగంపూర్‌ ఏరియాలో ఉంటున్న ఓ 16 ఏళ్ల యువతి ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ పార్క్‌ వద్దకు రాత్రి 9:30 నిమిషాలకు స్నేహితుడితో కలిసి వెళ్లింది. అనంతరం ఇంటికి ఆలస్యంగా రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో వారికి తాను స్నేహితుడ్ని కలిసేందుకు పార్క్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో నలుగురు గుర్తు తెలియని ఆగంతుకులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, తన స్నేహితుడు చూస్తుండగా వారు ఈ దారుణానికి ఒడిగట్టారని కట్టుకథ అల్లింది.

అయితే ఆమె అంచనాలు తప్పాయి. ఈ కట్టుకథతో తల్లిదండ్రులు మౌనంగా ఉంటారనుకున్న ఆమె ఆలోచన తల్లికిందులైంది. కుటుంబ సభ్యులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని సీసీ టీవీ పుటేజ్ సేకరించారు. అనంతరం ఆమె స్నేహితుడిని పిలిచి విచారించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆమె స్నేహితుడే ఆమెపై అత్యాచారం చేశాడని తేలింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. నిజం దాచిన ఆమెను మందలించి పంపేశారు.

  • Loading...

More Telugu News