: అల్లు అర్జున్ గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు!: నిర్మాత లగడపాటి శ్రీధర్


 రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్‌ నిర్మిస్తున్న సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే... ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఇచ్చిన మాట మీద నిలబడి తమతో సినిమా చేస్తున్నారని అన్నారు. తమకు ఒక సినిమా చేస్తానని గతంలో ఆయన మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం తమతో ఆయన సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమాను నాగబాబు, బన్నీ వాసు ఆధ్వర్యంలో నిర్మిస్తున్నామని చెప్పారు. రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభం కానుందని, ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ విలన్‌ గా నటిస్తున్నారని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News