: కారుని షాపింగ్‌ స్టోర్‌ లోపలికి తీసుకెళ్లాడు.. సరుకులు కొనుక్కుని మళ్లీ వెళ్లిపోయాడు.. మీరూ చూడండి!


ఓ  వ్య‌క్తి త‌న కారుని షాపింగ్‌ స్టోర్‌లోప‌లికి తీసుకెళ్లిన ఘ‌ట‌న చైనాలో చోటు చేసుకుంది. ఆ షాపింగ్ మాల్‌కి కారు పార్కింగ్ స్థ‌లం ఉంది. అయితే, కారుని పార్క్ చేసి.. మాల్‌లోకి వెళ్లి సరుకులు తీసుకొని.. మ‌ళ్లీ పార్కింగ్ స్థలంలోకి వెళ్లి త‌న కారును తీసుకునే వర‌కు స‌మ‌యం వృథా అవుతుంద‌ని ఆయ‌న ఇలా చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, తూర్పు చైనాలో జెన్‌జియాంగ్‌లో ఓ వ్యక్తి స్టోర్‌లోకి నేరుగా కారుని తీసుకెళ్లాడు. అంద‌రూ చూస్తుండ‌గానే తనకు కావాల్సిన స‌రుకుల‌ని కొనుక్కున్నాడు. అంద‌రూ ఆశ్చ‌ర్యంతో అత‌డినే చూస్తుండ‌గానే తాను కొనుక్కున్న వ‌స్తువుల‌కి బిల్లు చెల్లించి, వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆ మాల్‌లోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.   

  • Loading...

More Telugu News