: ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్ కు ఆదిలోనే షాకిచ్చిన పాక్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ఆదిలోనే ఇంగ్లండ్ ను దెబ్బకొట్టింది. ఆరో ఓవర్‌లోనే ఇంగ్లండ్ ఓపెనర్ హేల్స్ వికెట్ తీసింది. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రయీస్ బౌలింగ్‌లో హేల్స్.. బాబర్‌కు క్యాచ్ ఇచ్చుకుని వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో బైర్‌స్టో 25, రూట్ 6 పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు ఇంగ్లండ్ ఎనిమిది ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.