: 'నా పేరు సూర్య' అంటున్న అల్లు అర్జున్!


ఈ నెల 23న 'దువ్వాడ జగన్నాథమ్' సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో తన తదుపరి సినిమాపై అల్లు అర్జున్ దృష్టి పెట్టాడు. ప్రముఖ సినీ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారనున్న సినిమాలో అల్లు అర్జున్ నటించనున్నాడు. ఈ మేరకు సినిమా షూటింగ్ ప్రారంభించారు. నేడు ముహూర్తం సమయానికి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు, ఈ సినిమా యూనిట్ పూజాకార్యక్రమాలు పూర్తి చేశారు.

ఈ సినిమా పేరు 'నా పేరు సూర్య'గా ఖరారు చేశారు. దీనికి ఉప శీర్షికగా 'నా ఇల్లు ఇండియా' అని పెట్టారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీ, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమాకు దర్శకుడిగా వక్కంతం వంశీ పరిచయం కానుండగా, సంగీతాన్ని బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్-శేఖర్ ద్వయం అందించనున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ ను అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 

  • Loading...

More Telugu News