: నాన్న బాలయ్యకు అత్యంత ఖరీదైన బహుమతిని ఇచ్చిన బ్రాహ్మణి!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా వసూల్' సినిమా షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో కొనసాగుతోంది. ఇటీవలే బాలయ్య తన పుట్టిన రోజును పోర్చుగల్ లో జరుపుకున్నారు. ఈ వేడుకలను జరుపుకోవడానికి బాలయ్య సతీమణి వసుంధర, కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని, అల్లుళ్లు నారా లోకేష్, శ్రీ భరత్ లు పోర్చుగల్ వెళ్లారు. కుటుంబసభ్యుల మధ్య బాలయ్య తన పుట్టిన రోజును సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రికి బ్రాహ్మణి ఖరీదైన 'బెంట్లీ' కారును బహూకరించినట్టు సమాచారం. దీని విలువ రూ. 6 కోట్లట!