: రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించిన కాంగ్రెస్ నేతపై వేటు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని వ్యాఖ్యానించిన మీరట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్ ప్రధాన్ ను పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు యూపీ కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం చైర్మన్ రామకృష్ణ ద్వివేది ప్రకటించారు. కాగా, తనను సస్పెండ్ చేసిన తరువాత వినయ్ ప్రధాన్ స్పందిస్తూ, తమ నేత రాహుల్ అంటే తనకెంతో గౌరవమని, తాను ఎలాంటి పోస్టులనూ సోషల్ మీడియాలో పెట్టకున్నా, తనను పదవుల నుంచి తొలగించారని ఆరోపించారు. కనీసం తనను వివరణ అడిగే ప్రయత్నం కూడా చేయలేదని వాపోయారు. తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.