: ఎల్లుండి జరిగే సెమీస్‌లో భారత్ నిస్సందేహంగా గెలిచే జట్టే: బంగ్లాదేశ్ కోచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచుల్లో అద్భుతంగా రాణించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ ఎల్లుండి బలమైన ప్రత్యర్థి టీమిండియాను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు కోచ్ చండిక హతురుసింఘా మీడియాతో మాట్లాడుతూ సెమీస్‌లో అద్భుతంగా రాణించి క్రికెట్ ప్రపంచానికి తమ సత్తా ఏంటో చూపించాలని తాము ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పారు. అయితే, సెమీస్‌లో భారత్ నిస్సందేహంగా గెలిచే జట్టేనని చెప్పిన ఆయన.. తమ జట్టు మాత్రం సరిగ్గా పోరాడితే ఏ ప్రత్యర్థికైనా సవాల్ విసరగలదని అన్నారు. కాగా, రేపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్, ఇంగ్లండ్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి.