: యూనివర్శిటీకి సినారె పేరు.. కాంస్య విగ్రహాలు ఏర్పాటు: కేసీఆర్
ప్రముఖ కవి సి.నారాయణరెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సినారె నివాసంలోని ఆయన గదిని కేసీఆర్ సందర్శించారు. అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలోని ఒక యూనివర్శిటీకి సినారె పేరు పెడతామని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున సినారె పేరిట మ్యూజియం, సాహితీ మందిరం నిర్మిస్తామని చెప్పారు. ట్యాంక్ బండ్ తో పాటు కరీంనగర్, సిరిసిల్ల హనుమాజీ పేటలో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగు సాహిత్యంలో సినారె ఓ ధ్రువతార అని అన్నారు. ఆయనకు తాను పెద్ద అభిమానిని అని చెప్పారు. సినారె గొప్పదనాన్ని మరింతగా చాటేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.