: పార్టీ నుంచి ఇంకెవరైనా వెళ్తారా?: అఖిలప్రియను ప్రశ్నించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీకి శిల్పా మోహన్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడులతో నంద్యాల రాజకీయంపై ఆయన చర్చించారు. ఉప ఎన్నిక గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి ఇంకా ఎవరైనా వెళ్లే అవకాశం ఉందా? అంటూ అఖిలప్రియను చంద్రబాబు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఇంకెవరూ వెళ్లరని ఆమె తెలిపారు. మరోవైపు, టీడీపీలోకి వచ్చేవారు ఇంకా చాలా మంది ఉన్నారని ముఖ్యమంత్రికి ఆమె వివరించారు.