: లండన్ లోని భారత్ హై కమిషన్ లో టీమిండియా సందడి


లండన్ లోని భారత్ హై కమిషన్ కార్యాలయంలో టీమిండియా క్రికెటర్లు సందడి చేశారు. సౌతాఫ్రికా జట్టుపై విజయం సాధించిన టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ లో ప్రవేశించింది. 15న మ్యాచ్ జరగనుండడంతో రెండు రోజుల విశ్రాంతి లభించింది. ఈ నేపథ్యంలో లండన్ లోని భారత హై కమిషన్ కార్యాలయాన్ని సందర్శించాలని టీమిండియాకు పిలుపు వచ్చింది. దీంతో హై కమిషన్ కార్యాలయానికి వచ్చిన టీమిండియా ఆటగాళ్లు సిబ్బందితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా సిబ్బంది కుటుంబ సభ్యులు టీమిండియా ఆటగాళ్లతో సెల్పీలు దిగారు. 

  • Loading...

More Telugu News