: సీఎం యోగిపై ఫేస్ బుక్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు.. ముగ్గురి అరెస్ట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఫేస్ బుక్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 9న యోగిపై ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్న సుశీల్ యాదవ్ అనే వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని... దీనికి మద్దతుగా, సీఎంను అంతమొందిస్తే కోటి రూపాయల నగదుని ఇస్తానంటూ సునీల్ కుమార్ యాదవ్ అనే మరో వ్యక్తి కామెంట్ పెట్టాడని పోలీసులు తెలిపారు. వీటికి సయ్యద్ అనే వ్యక్తి లైక్ కొట్టాడని చెప్పారు. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిపై ఐపీసీ సెక్షన్లు 295, 504, 506ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.