: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చేదు అనుభవం!
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఊహించని అవమానం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్ లోని అమ్రేలీలో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆ వేడుకకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతుండగా, భండారియా గ్రామానికి చెందిన కాస్వాలా అనే వ్యక్తి లేచి మూడు గాజులను ఆమె మీదకి విసిరి, వందే మాతరం అంటూ నినాదాలు చేశాడు. అయితే వారి మధ్య దూరం కాస్త ఎక్కువ ఉండడంతో ఆ గాజులు ఆమెపై పడలేదు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి రైతు రుణమాఫీ, అప్పుల గురించి వివరించే ప్రయత్నంలో భాగంగా అలా చేశానని తెలిపాడు.