: పెళ్లైన పది రోజులకే ఆత్మహత్యాయత్నం చేసిన బ్రిటన్ యువరాణి డయానా!.. ఆలస్యంగా వెలుగులోకి!


బ్రిటన్ యువరాణి డయానా కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మరణం అప్పట్లో ప్రపంచాన్నే కుదిపేసింది. అయితే, ప్రిన్స్ చార్లెస్ తో పెళ్లైన 10 రోజులకే ఆమె ఆత్మహత్యా యత్నం చేసిందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందట. దీనికి కారణం ఆమె భర్త, ఆయన ప్రియురాలు కెమిల్లా పార్కర్ బౌల్స్ అనే విషయం బహిర్గతమైంది. తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని... బ్లేడ్ తో చేతుల మణికట్లు కోసుకునేందుకు ప్రయత్నిస్తున్నానంటూ డయానా తన వాయిస్ ను రికార్డు చేసుకున్నారు. ఈ ఆడియో రికార్డును తన స్నేహితురాలి వద్ద భద్రపరిచారు డయానా. 1996లో చార్లెస్ తో ఆమెకు వివాహమయింది. 'ఆండ్రూ మోర్టన్: డయానా-హర్ ట్రూ స్టోరీ' అనే పేరుతో ఓ పుస్తకం విడుదల కానుంది. ఈ పుస్తకంలో ఈ వివరాలను పొందుపరిచారు. 

  • Loading...

More Telugu News