: అమెరికాలో బంగ్లాదేశ్ దౌత్యాధికారి అరెస్ట్.. సిబ్బంది వేతనాలు చెల్లించకపోవడమే కారణం
అమెరికాలో బంగ్లాదేశ్ దౌత్యాధికారి ఒకరు అరెస్టయ్యారు. న్యూయార్క్‌లోని తన ఇంటిలో విదేశీ పనివాళ్లతో డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ షాహెల్దుల్ ఇస్లామ్ (45)పై లేబర్ ట్రాఫిక్ ట్రాఫికింగ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇస్లామ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా ఉన్నారు. ఈనెల 28న ఆయన కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది.