: ఛాంపియన్స్ ట్రోఫీ: ఆదిలోనే శ్రీలంకకు ఎదురుదెబ్బ


ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ రోజు శ్రీలంక-పాకిస్థాన్‌ల‌ మధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన‌ శ్రీ‌లంక‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. నిరోష‌న్ డిక్‌వెల్లా, గుణ ఓపెన‌ర్లుగా క్రీజులోకి వ‌చ్చారు. అయితే, 13 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద గుణ వెనుదిరిగాడు. అనంత‌రం క్రీజులోకి మెండిస్ వ‌చ్చాడు. ప్ర‌స్తుతం డిక్‌వెల్లా 13, మెండిస్ 0 స్కోరుతో క్రీజులో ఉన్నారు. శ్రీ‌లంక స్కోరు ఒక వికెట్ న‌ష్టానికి 26 ప‌రుగులు (6 ఓవ‌ర్ల‌కి)గా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జ‌ట్టు సెమీస్‌కి దూసుకెళ్ల‌నుంది. ఈ రోజు గెలిచిన జ‌ట్టు సెమీస్‌లో ఇంగ్లండ్ తో త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది.           

  • Loading...

More Telugu News