: ఖతర్‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఇరాన్.. 5 విమానాలు, మూడు ఓడల్లో ఆహార పదార్థాల సరఫరా!


ఖతర్‌తో గల్ఫ్ దేశాలు అన్ని రకాల  సంబంధాలను తెంచుకున్న నేపథ్యంలో ఆ దేశాన్ని ఆదుకునేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. ఐదు విమానాలు, మూడు నౌకల నిండా ఆహార పదార్థాలను పంపించింది. ఒక్కో విమానంలో పండ్లు, కూరగాయలతో కూడిన 90 టన్నుల బరువున్న ఆహార పదార్థాలను ఆదివారం ఖతర్‌కు పంపినట్టు  ఇరాన్ ఎయిర్ అధికార ప్రతినిధి షారోఖ్ నౌషాబడి తెలిపారు. మున్ముందు కూడా దీనిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ ఆహార పదార్థాలను ఎగుమతి చేశారా? లేక సాయంగా అందిస్తున్నారా? అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు.

ఉగ్రవాదానికి ఊతమిస్తోందన్న కారణంతో సౌదీ అరేబియా, బెహ్రయిన్, యూఏఈ, ఈజిప్ట్, యెమన్ దేశాలు ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న సంగతి విదితమే. అయితే సమస్య పరిష్కారం కోసం పొరుగు దేశాలతో చర్చలు జరపాలని ఖతర్‌ను ఇరాన్ కోరింది.

  • Loading...

More Telugu News