: మధురలో పెను విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి


మొక్కులు సమర్పించుకునేందుకు బయలుదేరిన ఓ కుటుంబం కథ విషాదాంతమైంది. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ విషాదం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం..  యూపీ బోర్డ్ ఎగ్జామ్స్‌లో పదో తరగతిలో తమ కుమార్తె మానసి 75 శాతం మార్కులు సాధించడంతో మొక్కులు సమర్పించుకునేందుకు రాజస్థాన్‌  దౌసాలోని మెహందీపూర్ బాలాజీ ఆలయ దర్శనానికి బరేలీకి చెందిన మహేష్ శర్మ కుటుంబం కారులో బయలుదేరింది. నిజానికి వారు శుక్రవారమే బయలుదేరాల్సి ఉండగా కారు డ్రైవర్ కుటుంబంలో ఒకరు మృతి చెందడంతో ప్రయాణం వాయిదా పడింది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వారు ఆలయానికి బయలుదేరారు. సరిగ్గా ఐదు గంటల ప్రయాణం తర్వాత డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న మధుర కాలువలోకి దూసుకెళ్లింది.

లోపల చిక్కుకున్న వారు బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వారంతా మృతి చెందారు. మహేశ్ శర్మ (45), ఆయన భార్య పూనమ్ (42), వారి నలుగురు సంతానం రితిక్ (16), హార్థిక్ (15), మానసి (18), కుష్బు (20), మహేశ్ కుమార్ సోదరి పూనమ్ (44), ఆమె కుమారుడు రోహన్ (19), కుమార్తె సురభి (17), డ్రైవర్ హరీష్ చంద్ మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  ఇరుకైన బ్రిడ్జి కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని, దానికి మరమ్మతులు చేయాలన్న తమ డిమాండ్‌ను అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News