: అభిమానులూ!... ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి!: హరీష్ శంకర్
బలమైన సంకల్పం ఉంటే ఎవరైనా సాధించలేనిది ఏమీ లేదని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెలిపాడు. ఈ సందర్భంగా మెగా అభిమానులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలని సూచన చేశాడు. డీజే ఆడియో వేడుక సందర్భంగా శిల్పకళావేదికలో మాట్లాడుతూ, ఒక యువకుడు పవన్ కల్యాణ్ సినిమాలు చూసి, అతనితో ఒక్క ఫోటో అయినా దిగాలని భావించి, హైదరాబాదు వచ్చి, అతనిని కలవడం కోసం సినిమాల్లో చేరి, వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుని, తన అభిమాన నటుడితో సినిమా తీసి అద్భుతమైన విజయం సాధించాడని, ఆ యువకుడు మరెవరో కాదని.. తానేనని తెలిపాడు.
పవన్ కల్యాణ్ తో ఫోటో దిగితే చాలని భావించే తాను... ఆయనతో ఒక సూపర్ హిట్ సినిమా తీశానని అన్నాడు. అంతే కాకుండా ఆయనతో కలసి చార్టర్డ్ ఫ్లైట్ లో కూర్చుని... తన అనుభవాలు, ఆశలు, ఆలోచలనలు అన్నీ చెప్పానని తెలిపాడు. దీనికి కారణం బలమైన సంకల్పమేనని, అభిమానులు అలాంటి సంకల్పంతో పని చేయాలని సూచించాడు.