: రెండో వికెట్ కోల్పోయిన సఫారీలు...ఈసారి జడేజా వంతు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్ లో టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రెండో బ్రేక్ ను రవీంద్ర జడేజా ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్ డికాక్ (53), హషీమ్ ఆమ్లా (35) శుభారంభం ఇచ్చారు. ఆమ్లాను అద్భుతమైన బంతితో అశ్విన్ 76 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపగా, 116 పరుగుల వద్ద అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్ ను మరో అద్భుతమైన బంతితో జడేజా అవుట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరొక వికెట్ తీశారు. క్రీజులో డుప్లెసిస్ (25), డివిలీర్స్ (9) ఉన్నారు.