: ముంబై ఎయిర్ పోర్టులో రూ. 36 కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత


ఇండియాలోకి భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకురావాలన్న పన్నాగాన్ని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అడ్డుకున్నారు. ఈ ఉదయం కొలంబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర రూ. 36 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఇంత విలువైన డ్రగ్స్ ముంబై ఎయిర్ పోర్టుకు రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News