: అలనాటి నటుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయనున్న బాలీవుడ్‌ నిర్మాతలు


‘పాకీజా’ సినిమాలో నటించి అలరించిన అలనాటి బాలీవుడ్ నటి గీతాకపూర్ ఇప్పుడు దయనీయస్థితిలో వృద్ధాశ్ర‌మంలో చేరిన విష‌యం తెలిసిందే. గీతాకపూర్‌కు ఓ కొడుకు, కూతురు ఉన్న‌ప్ప‌టికీ ఆమె బాగోగుల‌ను వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆమెకే కాదు, మ‌రికొంత మంది అల‌నాటి బాలీవుడ్ న‌టుల‌కి కూడా ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో అటువంటి వారిని ఆదుకునేందుకు బాలీవుడ్ నిర్మాత‌లు అశోక్‌ పండిట్‌, రమేష్‌ తౌరాని స‌హా ప‌లువురు వృద్ధాశ్రమం నెలకొల్ప‌నున్నారు. ఇదే విష‌య‌మై భారతీయ ఫిలిం, టెలివిజన్‌ దర్శకుల సంఘం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫ‌డ్న‌విస్‌కి ఓ విజ్ఞప్తి చేసింది. తాము నెల‌కొల్ప‌నున్న‌ వృద్ధాశ్రమ నిర్మాణానికి అనువైన చోటును కేటాయించాల‌ని కోరింది. గీతాక‌పూర్‌ని ఆమె కొడుకు ఆసుప‌త్రిలో అనాథ‌గా వ‌దిలేసివెళ్లిన‌ప్పుడు నిర్మాత‌ అశోక్‌ పండిట్ ఆమె వైద్య ఖర్చులను భ‌రించారు. అనంత‌రం అంధేరిలోని వృద్ధాశ్రమంకు ఆమెను తరలించారు.       

  • Loading...

More Telugu News