: బాలయ్య వర్సెస్ మహేశ్ బాబు.. దుమ్మురేపేది ఎవరో?


నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ విషయాన్ని బాలయ్యతో కలసి పోర్చుగల్ నుంచి చేసిన లైవ్ ఛాట్ లో పూరి జగన్నాథ్ వెల్లడించాడు. మరోవైపు మహేశ్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'స్పైడర్' సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఒక్క రోజు తేడాతో ఇద్దరు అగ్ర నటుల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సందడి చేస్తుందనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. 

  • Loading...

More Telugu News