: కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్‌ కు చేదు అనుభవం


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు ఒడిశాలో చేదు అనుభ‌వం ఎదురైంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతులు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారని, కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని నిర‌స‌న తెలుపుతున్న యూత్ కాంగ్రెస్ స‌భ్యులు ఈ రోజు రాధామోహ‌న్ సింగ్‌ వెళుతున్న కారుపై గుడ్లు విసిరారు. న‌ల్ల‌ జెండాలు ప్ర‌ద‌ర్శిస్తూ ఆయ‌న వెళుతున్న కారుని అడ్డుకోవడానికి వారు ప్రయత్నించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రైతులపై జ‌రిపిన కాల్పుల‌కు కేంద్ర మంత్రి స‌మాధానం చెప్పాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ ఐదుగురు యువ‌కుల‌ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.        


  • Loading...

More Telugu News