: ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతున్న బాలకృష్ణ‌, పూరీ జ‌గ‌న్నాథ్... అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలు!


నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ రోజు పూరి జ‌గ‌న్నాథ్, బాల‌య్య పోర్చుగ‌ల్ నుంచి  ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు. ఫేస్‌బుక్ లో అభిమానులు పోస్ట్ చేస్తోన్న కామెంట్ల‌ను బాలకృష్ణ‌, పూరీ జ‌గ‌న్నాథ్ చ‌దివి వినిపించారు. ‘కోకోకోలా.. పెప్సీ.. బాల‌య్య బాబు సెక్సీ’ అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌ను పూరీ జ‌గ‌న్నాథ్ చ‌ద‌వ‌గానే అంద‌రూ ఫ‌క్కున న‌వ్వారు. త‌న కంటే అభిమానులే అద్భుతంగా డైలాగులు రాస్తున్నార‌ని పూరీ కితాబు ఇచ్చారు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటారా? అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు.. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు కాదు, ముగ్గురు ఉన్నారని పూరీ చెప్పారు. ఓ అభిమాని 'లెజెండ్ మూవీ 10 సార్లు చూశా' అని కామెంట్ చేయ‌గా పూరీ, బాల‌య్య‌తో పాటు 'పైసా వ‌సూల్' సినిమా యూనిట్ 'వావ్' అనేసింది.

‘హీరోగా మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడు’? అని ఓ అభిమాని చేసిన కామెంట్‌కి టైముంద‌ని బాల‌య్య స‌మాధానం ఇచ్చారు. ‘ముక్కుసూటిగా ఉండేవారికి ఈ మూడక్షరాలు.. అవే బాల‌య్య’ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘రాముడు.. భీముడు బాల‌య్య బాబు దేవుడు’ అంటూ మ‌రో అభిమాని ఓ కవిత వదిలాడు. ‘హ్యాపీ బర్త్ డే బాలయ్య మావయ్య.. ఫస్ట్ టైం ఎఫ్‌బీ లైవ్‌కు వచ్చారు.. అది కూడా డేరింగ్ డైరెక్టర్‌తో కలిసి.. ఎలా ఫీలవుతున్నారు?’ అని ఓ అభిమాని అడిగాడు.. దానికి బాల‌య్య సూప‌ర్‌గా అని అన్నారు. ఊహించ‌ని కాంబినేష‌న్‌లో మూవీ వస్తోందని మ‌రో అభిమాని  పేర్కొన్నాడు. ఈ సినిమాలో పూరీ స్టైల్‌లో డైలాగులు ఉంటాయా? బాల‌య్య స్టైల్‌లో ఉంటాయా? అని ఓ అభిమాని అడిగాడు. ఇద్ద‌రి స్టైల్‌ల‌లోనూ ఉంటాయ‌ని పూరీ అన్నాడు.

టీజ‌ర్ ఎప్పుడు వ‌స్తుంద‌ని ఓ అభిమాని అడ‌గ‌గా.. ఈ సినిమా సెప్టెంబ‌రులో విడుద‌ల‌వుతుందని.. అంత‌కు ముందు టీజ‌ర్ ఉంటుంద‌ని పూరీ న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చాడు. ఈ రోజు పోర్చుగ‌ల్‌లో నేష‌న‌ల్ హాలీడే ఉంద‌ని, ఈ రోజు షూటింగ్ జ‌ర‌గ‌డం లేద‌ని అన్నారు. ఈ సినిమాలో బాల‌య్య పాట‌పాడ‌తార‌ని పూరీ చెప్పాడు. ‘అరె మామా అంటూ.. తిప్పు తిప్పు తిప్పు సిప్పు సిప్పు సిప్పు’ అంటూ పాట ఉంటుంద‌ని చెప్పాడు. బాల‌య్య బాబు పాట బాగా పాడారని చెప్పాడు. ఓ అభిమాని కామెంట్ చేస్తూ ‘అన్నయ్య గారు త్వరగా రండి.. హిందూపురంలో మీకోసం అందరూ ఎదురు చూస్తున్నాము.. జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య.. నారాయణస్వామి టౌన్ వైడ్ ప్యాన్స్ ట్రెజరర్ హిందూపురం’ అని పేర్కొన్నాడు.


  • Loading...

More Telugu News