: బాలయ్య కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'పైసా వసూల్' సినిమా రిలీజ్ డేట్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ అనౌన్స్ చేశాడు. సెప్టెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన తెలిపాడు. తన జన్మదిన వేడుకలను సినిమా యూనిట్ సభ్యుల మధ్య బాలయ్య పోర్చుగల్ లో చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన లైవ్ ఛాట్ లో అభిమానులను పలకరించారు. ఈ సందర్భంగానే సినిమా రిలీజ్ డేట్ ను పూరి జగన్నాథ్ వెల్లడించాడు. ఇప్పటికే పోర్చుగల్ లో షూటింగ్ పూర్తి కావొచ్చిందని ఆయన తెలిపాడు.