: ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్‌‌లో మళ్లీ మొదలైన అమ్మకాల సందడి.. ఆఫర్లే, ఆఫర్లు!


ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్‌లో నేటి నుంచి అమ్మకాల సందడి మొదలైంది. పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ 9 రోజులపాటు ఫ్యాషన్ ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించగా షాప్‌క్లూస్ వారం పాటు హోం కిచెన్, ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది.

జూన్ 10 నుంచి 18 వరకు ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్యాషన్ డేస్’ కొనసాగుతాయని, ఇందులో 50 రకాల బ్రాండ్లు అమ్మకానికి ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ హెడ్ రిషీ వాసుదేవ్ తెలిపారు. ఇందులో భాగంగా ‘బిడ్ ఎన్ విన్’ అనే కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రూ.13,995 విలువైన ఎంపోరియో అర్మానీ వాచీ, రూ.15,960 విలువైన విక్ట్రానిక్స్ బ్యాగ్ వంటివి గెలుచుకునే అవకాశం ఉందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

గత నెలలో రెండు రోజులపాటు నిర్వహించిన ట్రిపుల్ వాల్యూ సేల్‌కు విశేష ఆదరణ లభించిందని, లక్షకు పైగా లావాదేవీలు జరిగాయని షాప్‌క్లూస్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) హర్మీత్ సింగ్ తెలిపారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ‘ట్రిపుల్ వాల్యూ సేల్’‌లో ఆ ట్రాన్సాక్షన్స్ రెండింతలు అవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News