: కెప్టెన్ ఇన్నింగ్స్ తో అర్థ సెంచరీ చేసి ఔటైన విలియమ్సన్...కివీస్ 152/3


న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన ఫాంను చాటుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కార్డిఫ్ లో జరుగుతున్న వన్డేలో కివీస్ జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కి మార్టిన్ గుప్టిల్ (33) శుభారంభం ఇవ్వగా, మరో ఎండ్ లో ల్యూక్ రోంచి (16) విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కెన్ విలియమ్సన్ (57) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. గుప్టిల్ ను రూబెల్ హసన్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేయడంతో జత కలిసిన రాస్ టేలర్ (47)తో కలిసి కెప్టెన్ ఇన్నింగ్స్ తో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

 సింగిల్ చేసే ప్రయత్నంలో 152 పరుగుల వద్ద రనౌట్ కావడంతో నిలకడైన భాగస్వామ్యం విడిపోయింది. అనంతరం రాస్ టేలర్ కు బ్రూమ్ (9) జతకలిశాడు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు. చక్కని ఫీల్డింగ్ తో మెరుపులు మెరిపిస్తూ కివీస్ జోరుకు బంగ్లా ఆటగాళ్లు కళ్లెం వేస్తున్నారు. 32 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్, రూబెల్ హసన్ చెరొక వికెట్ తీశారు. 

  • Loading...

More Telugu News