: అమానుషం... 350కి పైగా అబార్షన్లు చేసిన డాక్టర్!
డాక్టర్ శ్రీనివాస్ అనే వైద్యుడు మహబూబాబాద్ జిల్లాలో గర్భిణుల కడుపుల్లో ఆడపిల్లలు పిండస్థరూపంలో ఉన్నారని తెలిసి 350కి పైగా భ్రూణహత్యలు. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే... భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న సమాచారంతో మానుకోట ఎస్పీ కోటిరెడ్డి వివిధ ఆసుపత్రులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్వేత నర్సింగ్ హోం వైద్యుడు శ్రీనివాస్ పట్టుబడ్డాడు. ఆయనను అరెస్ట్ చేసి, విచారించగా, సుమారు 350కి పైగా అబార్షన్లు చేసినట్టు వివరించారు. అయితే తన వద్దకు వచ్చిన వారంతా తమకు ఇంతకుముందే ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, ఇంకో ఆడపిల్ల వద్దని చెప్పడంతో అబార్షన్లు చేశానని సమర్థించుకోవడం విశేషం. తన వద్దకు రోజూ ఐదుగురి నుంచి ఆరుగురి వరకు పేషంట్లు వచ్చేవారని, వారిలో ఇద్దరు లేదా ముగ్గురు ఆడశిశువు అయితే వద్దనే వారని ఆయన తెలిపారు. దీంతో కంగుతున్న పోలీసులు.. నర్సింగ్ హోంలు, ల్యాబ్ లపై నిఘా పెట్టినట్టు తెలిపారు.