: బాలయ్య కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్... అదిరిపోయాయంతే!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం టైటిల్‌ను ఈ రోజు ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. బాలకృష్ణ రేపు పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్న సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. హ్యాపీ బర్త్ డే ఎన్‌బీకే అని కూడా ఈ ఫస్ట్‌లుక్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకి ‘పైసా వసూల్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవల తన 100వ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణితో బాలయ్య హిట్ సాధించిన విషయం తెలిసిందే. బాలయ్య నటిస్తోన్న ఈ 101వ మూవీలో ఆయన సరసన శ్రేయ శరన్, ముస్కాన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 29న విడుదల చేయనున్నారు.
#nbk101firstlook #PaisaVasool Balayya mass