: బాహుబలిలా దూసుకుపోదాం: చంద్రబాబు పిలుపు
ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసితో పనిచేయాలని, బాహుబలిలా దూసుకుపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అనంతపురం జిల్లాలోని ఉడేగోళంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... బాహుబలి సినిమాను మన తెలుగువాడు తీశాడని, అది అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లోనూ సత్తా చాటిందని అన్నారు. ఆ సినిమా 9 వేల థియేటర్లలో రిలీజైందని తెలిపారు. అదీ.. తెలుగువాడి శక్తి, సామర్థ్యం అని ఆయన చెప్పారు. బాహుబలిలాగే రాష్ట్ర ప్రజలు దూసుకుపోవాలని, అభివృద్ధిని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో 24 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని చెప్పారు.