: రైతులను దోచుకుంటే ఖబడ్దార్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అనంతపురం జిల్లాలోని ఉడేగోళం గ్రామంలో ఏరువాక పౌర్ణమి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... అనంతపురం జిల్లాను కరవురహిత జిల్లాగానే కాకుండా నెంబర్ వన్ జిల్లాగా కూడా చేస్తామని అన్నారు. అనంతపురం ఉద్యానవన పంటలకు కేంద్రంగా మారనుందని చెప్పారు. రైతులకు నష్టం వచ్చే విధంగా వ్యవహరించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
సూట్ పేరిట ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవని అన్నారు. రైతులను దోచుకుంటే ఖబడ్దార్.. జాగ్రత్త అని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని అన్నారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానిస్తామని చెప్పారు. రైతును గౌరవించాలని, ఆదరించాలని, రైతుకు ఇబ్బందులు లేకుండా చేయాలని, అప్పుడే రాష్ట్రం, దేశం బాగుపడతాయని ఆయన అన్నారు.