: సివిల్స్ లో మెరిసిన 30 తెలుగు తేజాలు
తాజాగా వెలువడిన సివిల్స్ 2012 పరీక్షా ఫలితాలలో తెలుగు తేజాలు మెరిశారు. రాష్టానికి చెందిన మేఘనాథ్ రెడ్డి 55వ ర్యాంక్ సాధించి ఐఎఎస్ ఖాయం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన ముంబయ్ లో ఐఆర్ఎస్ ట్రైనీగా వున్నారు. హైదరాబాదుకు చెందిన జి.సృజనకు 44వ ర్యాంక్, నగరానికే చెందిన కె.విశ్వజిత్ కు 205వ ర్యాంక్ దక్కాయి. జె.ఎల్.రెడ్డికి 101, రాయప్రోలు ఆదిత్యకు 398, సి.హెచ్.హరికృష్ణారెడ్డికి 427, రాజేంద్ర కుమార్ కు 516వ ర్యాంక్ లభించాయి. ఇలా రాష్ట్రానికి చెందిన 30 మందికి సివిల్స్ కొలువులు దక్కాయి. కేరళకు చెందిన హరిత వి కుమార్ టాపర్ గా నిలవగా, రెండో ర్యాంకు కూడా అదే రాష్ట్రానికి చెందిన శ్రీరామ్ దక్కించుకున్నారు.