: పాల్వాయి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. పార్థివదేహాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు ఆదేశం!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను కలచివేసిందని చెప్పారు. పాల్వాయి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పాల్వాయితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పాల్వాయి ఒక గొప్ప నేత అని కొనియాడారు. ఆయన పార్థివదేహాన్ని సిమ్లా నుంచి హైదరాబాదుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పరంగా వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.