: కేజ్రీవాల్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు కపిల్ మిశ్రా యత్నం... ఉద్రిక్తత!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రాను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేజ్రీవాల్ ను కలిసి, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎందుకు బర్తరఫ్ చేయలేదని అడుగుతానని ముందే చెప్పిన మిశ్రా, అన్నట్టుగానే ఈ ఉదయం తన అనుచరులతో కలసి కేజ్రీ ఇంటి వద్దకు వచ్చారు. కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బంది లోనికి వెళ్లేందుకు మిశ్రాకు అనుమతించకపోవడంతో, ఆయన వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సర్కారు లంచాల బాగోతంపై తనకు తెలిసిన సమాచారాన్ని, సాక్ష్యాలను ఇప్పటికే విచారణ అధికారులకు అందించానని చెప్పారు.