: యాహూ ఉద్యోగులకు చేదు వార్త.. 2వేల మంది ఉద్యోగులకు ఎసరు!


సెర్చింజన్ దిగ్గజం యాహూలో పనిచేస్తున్న 2వేల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. 4.48 బిలియన్ డాలర్ల‌తో యాహూను సొంతం చేసుకోబోతున్న వేరిజాన్ కమ్యూనికేషన్.. కొనుగోలు పూర్తయ్యాక 2వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వేరిజాన్‌కు చెందిన ఏఓఎల్, యాహూ నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని తెలుస్తోంది. రెండు యూనిట్లలో కలిపి 15 శాతం మందిని తొలగించనున్నట్టు సమాచారం. కాలిఫోర్నియాతోపాటు అమెరికా బయట కూడా ఉద్యోగుల కోత ఉంటుందని విశ్వనీయ వర్గాల సమాచారం. గురువారం జరిగిన షేర్ హోల్డర్ల సమావేశంలో కంపెనీ విక్రయానికి షేర్ హోల్డర్లు అంగీకరించారు.

  • Loading...

More Telugu News