: ‘సో అడోరబుల్’ అంటున్న సమంత!


టాలీవుడ్ లవర్స్ నాగచైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న జరగనున్నట్టు కొన్ని గంటల క్రితం ఈ జంట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫొటో పోస్ట్ చేసి ‘సో అడొరెబుల్’ అని పేర్కొంది. ఆ ఫొటోలో గమ్మత్తుగా ఉన్న బొమ్మలు ఉన్నాయి. ఆ ఫొటోలో ఓ స్టాండ్ పై ఉన్న రెండు బొమ్మలపై ‘చై, సామ్’ అని రాసి ఉన్నాయి. ఈ పోస్ట్ కు స్పందించిన నెటిజన్లు.. ‘యు ఆర్ లుకింగ్ లైక్ ఏంజెల్’, ‘నైస్’, ‘సో స్వీట్’, ‘చైతన్య-చాయ్, సమంతా-సమోస..చేసామ్’, ‘క్యూట్’.. అని కామెంట్స్ పెట్టారు.

  • Loading...

More Telugu News