: ‘ఎమ్మెల్యే’లో కల్యాణ్ రామ్‌కి చెల్లిగా యాంకర్ లాస్య!
టాలీవుడ్ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) మూవీలో టీవీ యాంకర్ లాస్య కూడా నటించనుంది. ఈ సినిమాలో ఆమె కల్యాణ్ రామ్‌కి చెల్లిగా కనపడనుందని సమాచారం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. రేపటి నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. యాంకర్ లాస్య ఈ మధ్యే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు. 'ఎమ్మెల్యే' సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.