: సెంచరీతో అదరగొట్టిన శిఖర్ ధావన్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న టీమిండియా, శ్రీలంక మ్యాచ్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అదరగొట్టేశాడు. ఓ వైపు కోహ్లీ పరుగులేమీ చేయకుండా, మరోవైపు యువరాజ్ సింగ్ 7 పరుగులకే వెనుదిరిగిన వేళ ధావన్ మాత్రం చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టిస్తున్నాడు. 112 బంతుల్లో సెంచరీ బాదాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 217గా ఉంది. క్రీజులో ధోనీ 20, ధావన్ 102 పరుగులతో ఉన్నారు.